ఓట్లు దండుకోవడం కోసమే హిందుత్వం

ఓట్లు దండుకోవడం కోసమే హిందుత్వం

జగిత్యాల జిల్లా: హిందుత్వం పేరుతో ఓట్లు దండుకునే బీజేపీ నాయకులు... తెలంగాణలో ఎక్కడైన గుళ్లు కట్టించారా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్,  ఎంపీ అర్వింద్ లకు ధైర్యం ఉంటే..  కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఆలయాలను అభివృద్ధి చేయాలని మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ రైతుల మనిషి కాదని.. కార్పొరేట్ సంస్థల మనిషని ఆయన విమర్శించారు. జగిత్యాల జిల్లా మల్కపేట, కోరుట్లలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ కేటీఆర్. ఈ పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. కేటీఆర్ కాన్వాయ్ పైకి చెరుకు రైతు చెప్పు విసిరాడు.