
- కేసీఆర్‌నే రండ అంటవా.. అంటూ చిందులు
- లక్షల మందిమి ఉన్నం.. పండవెట్టి తొక్కుతం.. అంటూ కామెంట్స్
మంచిర్యాల, వెలుగు: చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి రెచ్చిపోయారు. సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర పదజాలంతో నోరుపారేసుకున్నారు. చెప్పు చూపిస్తూ ‘‘చెప్పుతో కొడ్త” అంటూ ఊగిపోయారు. సోమవారం మంచిర్యాలలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో బాల్క మాట్లాడారు. వేదికపైనే తన కాలి చెప్పును తీసి చూపిస్తూ ఇష్టమున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డిపై కామెంట్స్ చేశారు. ‘‘ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోడు... గుంపు మేస్ట్రీ ఏం మాట్లాడుతుండు. కాలం కలిసొచ్చి నీ అదృష్టమో, తెలంగాణ ప్రజల దురదృష్టమో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నవ్. గతంలో చిల్లరగాని లెక్క, పోకిరిగాని లెక్క మాట్లాడినవ్.. ఇవ్వాళ నువ్వు కూర్చున్న స్థాయి, పదవిని బట్టి, దానికున్న విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలె. కేసీఆర్‌ను పట్టుకొని రండ అని అంటవా? చెప్పు తీసుకొని కొడత. బిడ్డా.. ఖబడ్దార్. మేం పవర్లో లేకపోవచ్చు.. కానీ లక్షల మందిమి ఉన్నం. కేసీఆర్‌ను అంటే పండవెట్టి తొక్కుతం” అంటూ బాల్క సుమన్ రెచ్చిపోయారు.