పోలీసుల లాగుల్లో తొండలు వదుల్తం : మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి

పోలీసుల లాగుల్లో తొండలు వదుల్తం : మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి
  • ఖబడ్దార్.. సీపీ సజ్జనార్ 
  • బీఆర్ఎస్​ మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్​ను అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆర్మూర్​బీఆర్ఎస్​మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి హెచ్చరించారు. పోలీసుల లాగుల్లో తొండలు వదులుతామన్నారు. కేసీఆర్​సిట్​విచారణ నేపథ్యంలో ఆదివారం ఆయన తెలంగాణ భవన్​లో మాట్లాడారు. ఖబడ్దార్.. సీపీ సజ్జనార్..​ నీకు ప్రత్యేకంగా వార్నింగ్​ఇస్తున్నాం.. మరో ఏడాదిలో బీఆర్ఎస్​అధికారంలోకి వస్తుంది.. నువ్వు ఏం చేస్తావో చేస్కో.. 2023లో నాకు నోటీసులిచ్చినా ఇప్పటికీ ఏం చేయలేకపోయావ్.. ఇక మా బాస్​ను ఏం చేస్తావ్.. మా వర్కింగ్​ప్రెసిడెంట్​ఒక్క పిలుపునిస్తే చాలు రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తం.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 డీజీపీ కావాలని సజ్జనార్​కలలు కంటున్నారని, కర్నాటకలో కాంగ్రెస్​ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పింక్ బుక్​లో నంబర్ వన్​గా సజ్జనారే ఉంటారన్నారు. ఆయన కర్నాటక పోయినా, పుణే పోయినా, ఎంపీ అయినా వదిలేది లేదని హెచ్చరించారు.