గుడ్ న్యూస్.. రైతు బంధు రూ. 16 వేలు

గుడ్ న్యూస్.. రైతు బంధు రూ. 16 వేలు

తెలంగాణలో అన్నదాతలకు అందించే రైతు బంధు సాయాన్ని రూ. 16 వేలకు పెంచబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన సందర్బంగా ఎకరాకు రూ. 10వేలు అందిస్తున్న రైతు బంధు సాయాన్ని  రూ. 16 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన సందర్భంగా కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. 

రైతు బంధు ఇలా పెరుగుతుంది..

రైతు బంధు పథకాన్ని రూ. 16 వేలకు పెంచుతున్నామన్నారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా మొదటి ఏడాది రూ. 12 వేలు పెరుగుతుందని చెప్పారు. ప్రతీ ఏడాది కొంత మొత్తం పెరుగుతూ..ఐదో ఏడాదికి ఎకరాకు రూ. 16 వేలు రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు. 

తెలంగాణలో 60 నుంచి 70 శాతం మంది ప్రజలు వ్యవసాయం చేస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. వ్యవసాయ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. తెలంగాణ ఈ పదేళ్లలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే స్థాయికి ఎదిగిందని చెప్పారు. వ్యవసాయ స్థీరికరణ విజయవంతం చేశామని..ఉత్పాదకతను పెంచుకుంటూ వ్యవసాయ రాష్ట్రంగా భవిష్యత్తులో తెలంగాన వెలుగొందాలని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

ALSO READ : తాత, నాయనమ్మ దివ్య ఆశీస్సులతో బీఫామ్ అందుకున్న కేటీఆర్