నీళ్లపై బీఆర్ఎస్‌‌‌‌ది రాజకీయ డ్రామా..హంగామా చేసి క్రెడిట్ కొట్టేయాలనే ఎత్తుగడ: మంత్రి జూపల్లి కృష్ణారావు  

  నీళ్లపై బీఆర్ఎస్‌‌‌‌ది రాజకీయ డ్రామా..హంగామా చేసి క్రెడిట్ కొట్టేయాలనే ఎత్తుగడ: మంత్రి జూపల్లి కృష్ణారావు  
  • పాలమూరు పెండింగ్‌‌‌‌ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి జూపల్లి కృష్ణారావు  ఖండించారు. ఎల్‌‌‌‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా, సాగునీటి అధికారుల ప్రణాళిక మేరకే జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌‌‌‌సాగర్ ప్రాజెక్టులకు నీటి నిర్వహణ జరుగుతోందని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి సొంత జిల్లాకు నీళ్లు ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందేందుకే ఆ పార్టీ నేతలు ప్రాజెక్టుల వద్ద హంగామా చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ప్రచారం చేసుకోవడానికే ఈ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌‌‌‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వంద శాతం పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పారు.

శుక్రవారం సచివాలయం మీడియా సెంటర్‌‌‌‌లో ఎమ్మెల్యేలు మధుసూదన్‌‌‌‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, ఈఎన్సీ (జనరల్) రమేష్‌‌‌‌బాబు, సీఈ విజయభాస్కర్‌‌‌‌రెడ్డితో క‌‌‌‌లిసి మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జూరాలతో పాటు ఇతర ప్రాజెక్టులకు ఇన్‌‌‌‌ఫ్లో పెరుగుతోందని, వచ్చిన నీటికి అనుగుణంగా సాగునీటి అధికారులు ప్రణాళిక ప్రకారం విడుదల చేస్తున్నారని మంత్రి చెప్పారు. ఉమ్మడి పాల‌‌‌‌మూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టుల‌‌‌‌ను పూర్తి చేస్తామన్నారు. 

కృష్ణా జలాల్లో వాటా సాధించి తీరుతం

లక్షల ఎకరాలకు సాగునీరు అందించే  ప్రాజెక్టులను పదేండ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని మంత్రి మండిపడ్డారు. కల్వకుర్తి కింద అదనంగా 25 టీఎంసీల నీటిని అందించే ప్రాజెక్టును ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.  జూరాలకు 50 టీఎంసీల వినియోగానికి అవసరమైన రిజర్వాయర్లు, గట్టు, తుమ్మిళ్ల వంటి ప్రాజెక్టులను  నిర్లక్ష్యం చేశారన్నారు.

తెలంగాణ నీటి హక్కులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌‌‌‌కు ధారాదత్తం చేసిందని ద్వజ‌‌‌‌మెత్తారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో 811 టీఎంసీల నీటిలో తెలంగాణకు అధిక వాటా సాధించుకునే అవకాశాన్ని వదులుకుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌‌‌‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 299 టీఎంసీల హక్కులు కల్పించే పరిస్థితిని తీసుకొచ్చిందన్నారు.