- ఫస్ట్ ఫేజ్‌లో 30 వేల మంది స్టూడెంట్స్‌కు బ్రేక్ ఫాస్ట్
- మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, వెలుగు : సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం ద్వారా మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు అల్పాహారం అందించే సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. మంగళవారం మెదక్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెంట్రలైడ్ కిచెన్ ను పరిశీలించారు. వివిధ రకాల బ్రేక్ ఫాస్ట్ లు తయారుచేసే యంత్రాలను చూశారు. ఆయా యంత్రాల సామగ్రి సామర్ధ్యాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రజా ప్రతినిధులు చేతుల మీదుగా సెంట్రలైజ్ కిచెన్ ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఫస్ట్ ఫేజ్‌లో మెదక్ జిల్లా వ్యాప్తంగా 395 పాఠశాలలో చదువుకుంటున్న 30 వేల మంది విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. ఆ తర్వత దశల వారీగా జిల్లాలోని అన్ని స్కూల్స్‌కు విస్తరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈవో రాజు, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, మెదక్ కిచెన్ ప్లాంట్ మేనేజర్ పునీత్ త్రిపాఠి, హెచ్ కే ఎం ట్రస్ట్ ఆర్గనైజర్ వీర, డిస్ట్రిబ్యూషన్ మేనేజర్ నవీన్, విద్యాశాఖ బ్రేక్ ఫాస్ట్ ఇన్చార్జ్ పవన్ కుమార్ పాల్గొన్నారు.
