నిమజ్జనానికి  రూ.1.50 కోట్లతో ఏర్పాట్లు: మేయర్ కొలగాని శ్రీనివాస్ 

నిమజ్జనానికి  రూ.1.50 కోట్లతో ఏర్పాట్లు: మేయర్ కొలగాని శ్రీనివాస్ 

కరీంనగర్ టౌన్, వెలుగు: గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా కరీంనగర్​బల్దియా ఆద్వర్యంలో రూ.1.5కోట్లతో ఏర్పాట్లు పూర్తి చేశామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం నగరంలోని టవర్ సర్కిల్, రాంనగర్, కమాన్ తదితర ప్రాంతాల్లోని గణేశ్​పాయింట్లను డిప్యూటీ మేయర్ సునీల్ రావు, హిందూఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గణేశ్ పాయింట్లతో పాటు నిమజ్జనం ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కొత్తపల్లి, మానకొండూర్ చెరువులు, చింతకుంట కెనాల్ నిమజ్జనం పాయింట్ల వద్ద ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు  చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, రాధాకృష్ణారెడ్డి, కార్పొరేటర్లు అంజన్ కుమార్, ప్రవీణ్ రావు, శ్రీలేఖ, ప్రభావతి పాల్గొన్నారు.