సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి చనిపోయాడు !

సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి చనిపోయాడు !

సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ నుంచి దూకి ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బోడుప్పల్కు చెందిన నిత్యతేజ (24) అనురాగ్ యూనివర్సిటీలో ఫైనలియర్ చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం అమీర్​పేట్లోని తన స్నేహితుడిని కలుస్తానని ఇంటి నుంచి బయలుదేరి, ఉప్పల్ నుంచి మెట్రోలో సికింద్రాబాద్ చేరుకున్నాడు.

సాయంత్రం 6:10 గంటల సమయంలో స్టేషన్ పైఅంతస్తు నుంచి దూకి మృతి చెందాడు. మృతుడి చేతికి పాత గాయం ఉండటంతో, గతంలోనూ ఆత్మహత్యాయత్నం చేసి ఉంటాడా అనే కోణంలో గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.