హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది మే 1వ తేదీన వైశాఖ పౌర్ణమి వస్తోంది. ఇదే రోజును మనం 'బుద్ధ పౌర్ణమి'గా జరుపుకుంటాం. ఎందుకంటే, గౌతమ బుద్ధుడు జన్మించినది, ఆయనకు జ్ఞానోదయం కలిగినది ఇంకా ఆయన పరమపదించినది కూడా ఇదే రోజున అని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల సుఖసంతోషాలు, సంపద కలుగుతాయని పెద్దలు చెబుతుంటారు.... అయితే అవేంటో చూద్దాం:
1. బుద్ధుని విగ్రహం
శాంతికి మారుపేరు బుద్ధుడు. ఇంట్లో బుద్ధుని విగ్రహం ఉంటే మనశ్శాంతి లభిస్తుందని వాస్తు నిపుణులు చెబుతారు. బుద్ధ పౌర్ణమి రోజున ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుని విగ్రహాన్ని లేదా లాఫింగ్ బుద్ధాను తెచ్చుకుని ఇంట్లో కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంచండి. దీనివల్ల ఇంట్లోని ఒత్తిడి తగ్గి, ప్రశాంతత నెలకొంటుంది.
2. ఇత్తడి ఏనుగు
వాస్తు శాస్త్రం ప్రకారం ఏనుగు స్థిరత్వానికి, ఐశ్వర్యానికి సంకేతం. బుద్ధ పౌర్ణమి రోజున ఇత్తడితో చేసిన ఏనుగు బొమ్మను కొని, ఇంటి ముఖ ద్వారం లోపలి వైపు చూస్తున్నట్లుగా పెడితే ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గి సఖ్యత పెరుగుతుంది.
3. గవ్వలు
గవ్వలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పాల సముద్రాన్ని చిలికినప్పుడు పుట్టిన వస్తువుల్లో గవ్వలు కూడా ఉన్నాయి. అందుకే సంపద పెరగాలంటే గవ్వలు ఇంట్లో ఉండాలని అంటారు. ఈ రోజు కొన్ని గవ్వలను తెచ్చుకుని, వాటికి పూజ చేసి, ఎర్రటి బట్టలో కట్టి మీ బీరువాలో లేదా డబ్బులు పెట్టే చోట ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
ALSO READ : బుద్ధ పూర్ణిమ 2026 : ప్రపంచానికి ఙ్ఞానాన్ని అందించిన గౌతముడు పుట్టిన రోజు ఇదే..!
4. వెండి నాణెం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండికి, చంద్రుడికి దగ్గరి సంబంధం ఉంది. చంద్రుడు మనస్సుకు కారకుడు. పౌర్ణమి రోజున వెండి నాణెం కొని మీ పూజ గదిలో ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు.
5. శ్రీ యంత్రం
శ్రీ యంత్రం సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపం. బుద్ధ పౌర్ణమి నాడు శ్రీ యంత్రాన్ని ఇంటికి తెచ్చుకుని నిష్టతో పూజిస్తే సంపదకు కొదవ ఉండదు. వ్యాపారంలో అభివృద్ధి చెందాలన్నా, ఇంట్లో దరిద్రం పోవాలన్నా ఈ యంత్రాన్ని పూజా గదిలో ఉంచి రోజూ ప్రార్థించడం మంచిది.

