బడ్జెట్ అప్‌డేట్స్: రైల్వేల అభివృద్ధికి రూ.1.10 లక్షల కోట్లు

బడ్జెట్ అప్‌డేట్స్: రైల్వేల అభివృద్ధికి రూ.1.10 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: ఈ ఏడాది బడ్జెట్‌‌లో రైల్వేలకు కేంద్రం రూ.1.10 లక్షల కోట్లను కేటాయించింది. 2030 సంవత్సరం నాటికి కొత్త రైల్ ప్లాన్‌‌ అమలు టార్గెట్‌‌గా నిధులను ప్రకటిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2022 జూలై నెల నాటికి ఈస్టర్న్, వెస్టర్న్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. వీటిని పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మిస్తామన్నారు.

2023 డిసెంబర్ నాటికి బ్రాడ్ గేజ్ రైల్వే ట్రాక్‌‌లను 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్మల తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని టూరిస్ట్ రూట్లలో విస్టాడోమ్ ఎల్‌‌హెచ్‌బీ కోచ్‌‌లను అటాచ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రూట్లలో ట్రెయిన్ సేఫ్టీ కోసం యాంటీ కొలిజన్ సిస్టమ్‌‌ను ఇన్‌స్టాల్ చేయనున్నట్లు పేర్కొన్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అభివృద్ధి కోసం రూ.18 వేల కోట్లు కేటాయించామన్నారు.