ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప 2(Pushpa 2). నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప పార్ట్ 1 భారీ విజయాన్ని సాధించిన నేపధ్యంలో పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా రిలీజ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే తాజాగా పుష్ప పార్ట్ 2 టీజర్ రిలీజ్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా ఏప్రిల్ 8న టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే టీజర్ రిలీజ్ కు ఒకరోజు ముందు ఆసక్తికర పోస్ట్ చేశారు. బన్నీ తన ఇంస్టాగ్రామ్ లో.. అంతా సిద్ధం అయిపోయింది.. అంటూ స్క్రీన్ పైన పుష్ప 2 టైటిల్ ఉన్న ఫోటోని షేర్ చేశారు. దీంతో.. పుష్ప 2 టీజర్ పై మరింత ఆసక్తి పెరిగింది. ఇక అల్లు అర్జున్ చేసిన ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన బన్నీ ఫ్యాన్స్.. అన్నా.. టీజర్ అదిరిపోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య విడుదల కానున్న టీజర్ నెట్టింట ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.