వారం గ్యాప్‌‌తో రిలీజ్ కానున్న అనుపమ నటించిన రెండు చిత్రాలు

వారం గ్యాప్‌‌తో రిలీజ్ కానున్న అనుపమ నటించిన రెండు చిత్రాలు

ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆకట్టుకుంటోంది అనుపమ పరమేశ్వరన్. ‘కార్తికేయ 2’తో ప్యాన్‌‌ ఇండియా సక్సెస్‌‌ను అందుకున్న ఆమె.. మరోసారి నిఖిల్‌‌తో కలిసి ‘18 పేజెస్‌‌’చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈనెలలోనే ఆమె నటించిన మరో సినిమా ‘బటర్‌‌‌‌ ఫ్లై’ కూడా రిలీజ్‌‌కు రెడీ అవుతోంది. అనుపమ లీడ్‌‌ రోల్‌‌లో నటించిన ఈ లేడీ ఓరియెంటెడ్‌‌ మూవీకి ఘంటా సతీష్‌‌ బాబు దర్శకత్వం వహించాడు. నిహాల్ కోదాటి ఆమెకు జంటగా నటించాడు. భూమికా చావ్లా కీలకపాత్ర పోషించింది. డిసెంబర్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు సోమవారం అనౌన్స్ చేశారు. 

అయితే థియేటర్స్‌‌లో కాకుండా డిస్నీ ప్లస్‌‌ హాట్‌‌ స్టార్‌‌‌‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇదొక సస్పెన్స్‌‌ థ్రిల్లర్. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23న ‘18 పేజెస్‌‌’ చిత్రం థియేటర్స్‌‌లో వస్తుండగా, నెలాఖరులో ‘బటర్‌‌‌‌ ఫ్లై’ ఓటీటీలోకి రాబోతోంది. వారం గ్యాప్‌‌తో అనుపమ నటించిన రెండు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మరోవైపు తమిళంలో ‘సైరెన్’, మలయాళంలో ‘జేఎస్కే’ చిత్రాల్లో ఆమె నటిస్తోంది.