ఫైనల్లో ఓటమి.. రన్నరప్ గా సింధు

ఫైనల్లో ఓటమి.. రన్నరప్ గా సింధు

బాలి: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమి పాలైంది. ఇండోనేసియాలోని బాలిలో జరిగిన మహిళల సింగిల్స్ టైటిల్ ఫైట్ లో సౌత్ కొరియా ప్లేయర్ సియాంగ్ చేతిలో సింధు పరాజయం పాలైంది. మ్యాచ్ ఆరంభమైనప్పటి నుంచి ఆధిపత్యం కనబర్చిన సియాంగ్.. వరుస సెట్లలో ఇండియా ప్లేయర్ ను ఓడించింది. తొలి సెట్ లో కాస్త ప్రతిఘటించిన సింధు.. రెండో సెట్ లో పూర్తిగా చేతులెత్తేసింది. దీంతో టైటిల్ ను కైవసం చేసుకునే చాన్స్ ను కోల్పోయింది.