2070 నాటికి దేశానికి రూ. 852 లక్షల కోట్ల లాభం

2070 నాటికి దేశానికి రూ. 852 లక్షల కోట్ల లాభం
  • 2070 నాటికి  రూ.852 లక్షల కోట్ల లాభం వస్తుంది
  • అంచనావేసిన సేల్స్‌‌ఫోర్స్

న్యూఢిల్లీ : కార్బన్ ఎమిషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గించుకోవడం, గ్రీన్ ఎనర్జీ వైపు షిఫ్ట్‌‌‌‌‌‌‌‌ అవుతుండడంతో 2070 నాటికి దేశానికి రూ. 852 లక్షల కోట్ల (11 ట్రిలియన్ డాలర్ల) లాభం చేకూరుతుందని సేల్స్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్ వివరించింది. గ్రీన్ ఎనర్జీతో పెట్రోల్‌‌, డీజిల్‌‌పై చేసే ఖర్చు భారీగా తగ్గుతుంది. ఇంకా బొగ్గు వాడకం తగ్గిపోతుంది.  యూగవ్‌‌‌‌‌‌‌‌, యాక్సెస్‌‌‌‌‌‌‌‌ పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఈ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను సేల్స్‌‌ఫోర్స్‌‌ తయారు చేసింది. ఈ రిపోర్ట్ కోసం దేశంలోని మొత్తం 1,000 బిజినెస్‌‌‌‌‌‌‌‌ మేనేజర్ల నుంచి అభిప్రాయాలను సేకరించారు. దేశంలోని మెజార్టీ కంపెనీలు తమ కార్బన్ ఎమిషన్స్‌‌‌‌‌‌‌‌ను జీరోకి తీసుకురావాలని చూస్తున్నాయి. కార్బన్‌‌‌‌‌‌‌‌ డై ఆక్సైడ్‌‌‌‌‌‌‌‌ (సీఓ2) ను ఎక్కువగా విడుదల చేస్తున్న దేశాల్లో ఇండియా మూడో స్థానంలో ఉంటుంది.

కానీ, గ్లోబల్‌‌‌‌‌‌‌‌ పెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాపిటా (ఒక వ్యక్తి విడుదల చేసే సీఓ2)  యావరేజ్ కంటే ఇండియా చాలా దిగువన ఉంది.   2050 నాటికి నెట్ జీరో లెవెల్‌‌‌‌‌‌‌‌కు చేరుకోవాలని ఇండియా పెట్టుకున్న టార్గెట్‌‌‌‌‌‌‌‌కు 83 % మంది రెస్పాండెంట్లు  సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారని సేల్స్ పోర్స్ రిపోర్ట్  వెల్లడించింది. వాతావరణ మార్పుపై ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టాలని  40 % మంది రెస్పాండెంట్లు అభిప్రాయపడ్డారు. 2050 నాటికి ఇండియాను నెట్‌‌‌‌‌‌‌‌ జీరో ఎకానమీగా మార్చాలని ప్రభుత్వం టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది. ఈ టార్గెట్‌‌‌‌‌‌‌‌తో కొత్తగా జాబ్స్‌‌‌‌‌‌‌‌  క్రియేట్ అవుతాయని 58 % మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. ఈ టార్గెట్ చేరుకోవడంలో టెక్నాలజీ సహకారం తప్పనిసరి అని  84 % మంది తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం : -
ఎయిర్ విస్తారాకు 10లక్షల ఫైన్

ఎయిర్ ఇండియాలో వీఆర్ఎస్