ఈ నాలుగు పనులు చాలా ఇంపార్టెంట్‌‌

ఈ నాలుగు పనులు చాలా ఇంపార్టెంట్‌‌

మామూలుగా అయితే ప్రతి ఏటా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈసారి కరోనా, లాక్‌‌డౌన్‌‌ వల్ల ఇన్‌‌కమ్ ట్యాక్స్‌‌ రిటర్న్స్‌‌ (ఐటీఆర్‌‌) వంటి పనులకు గడువును పొడగించారు. ట్యాక్స్‌‌ సేవింగ్‌‌ ఇన్వెస్ట్‌‌మెం ట్లకు కూడా ఇంకా సమ యం ఉంది. ఈ ఏడాది మార్చి 25 నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌‌డౌన్‌‌ విధించడంతో ఐటీఆర్ పైలింగ్‌ సాధ్యం కాలేదు. అందుకే గడువును జూన్‌‌ 30 వరకు పొడగించారు. అంటే ఇంకా మిగిలి ఉన్నవి తొమ్మిది రోజులు మాత్రమే. ఈలోపు అర్జెంటుగా చేయాల్సిన పనుల లిస్టు ఇది.

1.ట్యాక్స్ సేవింగ్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్లు

2019–20 ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదా కోసం ఇన్వెస్ట్‌‌మెంట్లను స్టార్ట్‌‌ చేయకుంటే, ఈ తొమ్మిది రోజుల్లోపే మొదలుపెట్టాలి. ఇందుకోసం ఐటీశాఖ కొత్త ట్యాక్స్‌‌ ఫారాల్లో ప్రత్యేక టేబుల్‌‌ ఇచ్చింది.ఏప్రిల్‌‌–జూన్‌‌ మధ్య చేసిన ఇన్వెస్ట్‌‌మెంట్ల గురించి ఇందులో తెలియజేయాలి. దీనివల్ల 2020 ఆర్థిక సంవత్సరానికి పన్ను తగ్గింపునకు దరఖాస్తు చేసుకోవడం సాధ్యమవుతుంది.

2. ఐటీఆర్‌‌ ఫైలింగ్‌‌

మామూలుగా అయితే రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్‌‌ను జూలై 31లోపు అందజేయవచ్చు. బిలేటెడ్‌‌ ఐటీఆర్‌‌ను సబ్మిట్‌‌ చేయడానికి మార్చి 31 వరకు గడువు ఉంటుంది. 2019 ఆర్థిక సంవత్సరానికి ఈ ఏడాది మార్చిలోపే ఐటీఆర్‌‌ అందజేయాలి కానీ ఈ గడువును 30వ తేదీ వరకు పెంచారు. ఇది వరకు దాఖలు చేసిన దాంట్లో తప్పులు ఉంటే, మరోసారి ఐటీఆర్‌‌ను అందజేయవచ్చు.

3.స్మాల్‌‌ సేవింగ్స్‌‌ స్కీమ్‌‌లో ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌

వీలైనంత త్వరగా పబ్లిక్‌‌ ప్రావిడెంట్ ఫండ్‌‌ (పీపీఎఫ్‌‌), సుకన్యా సమృద్ధి యోజన వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ చేయాలి. దీనివల్ల అకౌంట్లు యాక్టివ్‌‌గా ఉంటాయి. పీపీఎఫ్‌‌లో నెలకు కనీసం రూ.500లు ఇన్వెస్ట్‌‌ చేయాలి. ఎస్‌‌ఎస్‌‌వై అయితే కనీస ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ రూ.250.

4.ఆధార్‌‌-పాన్‌‌ లింకింగ్‌‌

ఆధార్‌‌కార్డుతో పాన్‌‌కార్డును లింక్‌‌ చేయడానికి ఈ నెల 30 వరకు మాత్రమే గడువు ఉంది. ఈలోపు లింక్‌‌ కాకపోతే వచ్చే నెల నుంచి పాన్‌‌కార్డు పని చేయదని క్లియర్‌‌ ట్యాక్స్‌‌ సీఈఓ అర్చిత్‌‌ గుప్తా అన్నారు. ఇక నుంచి అన్ని ఫైనాన్షియల్‌‌ ట్రాన్సాక్షన్స్‌‌కు పాన్‌‌ నంబరును పేర్కొనడం తప్పనిసరి అని చెప్పారు. ఏదైనా ఆస్తి కొన్నా, బ్యాంకు, డీమాట్‌‌ ఎకౌంట్‌‌ తెరిచినా పాన్‌‌ నంబరును తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పారు.