లారీ ఢీకొని భర్త కళ్లెదుటే భార్య మృతి.. శంషాబాద్ మండలం పాలమాకుల సమీపంలో ఘటన

లారీ ఢీకొని భర్త కళ్లెదుటే భార్య మృతి.. శంషాబాద్ మండలం పాలమాకుల సమీపంలో ఘటన

గండిపేట, వెలుగు: కూతురిని చూసేందుకు భర్తతో కలిసి వెళ్తున్న మహిళను లారీ ఢీకొనడంతో స్పాట్​లోనే చనిపోయింది. మైలార్​దేవ్​పల్లిలోని మధుబన్ కాలనీకి చెందిన గూడ రాజు, స్వప్న దంపతులు. షాద్​నగర్​లో ఉంటున్న తమ కూతురిని చూడటానికి ఆదివారం మధ్యాహ్నం బైక్​పై బయలుదేరారు. 

శంషాబాద్ మండలం పాలమాకుల సమీపంలో వీరిని వెనుక నుంచి లారీ కంటైనర్ ఓవర్​స్పీడ్​తో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న స్వప్న కిందపడి పోగా, ఆమె తలపై నుంచి లారీ టైరు దూసుకెళ్లి అక్కడికక్కడే చనిపోయింది. భర్త రాజుకు తీవ్ర గాయాలు కాగా, సమీప హాస్పిటల్​కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.