V6 News

టెక్నాలజీని ఎలా వాడాడో చూడండి.. మ్యాగ్నెట్ తో మాయ.. చలాన్లు తప్పించుకునేందుకు బైకర్ ఎత్తుగడ

టెక్నాలజీని ఎలా వాడాడో చూడండి.. మ్యాగ్నెట్ తో మాయ.. చలాన్లు తప్పించుకునేందుకు బైకర్ ఎత్తుగడ

 

  • నంబర్​ ప్లేట్​ను లోపలికి మలిచిపెట్టేలా ఏర్పాటు

గచ్చిబౌలి, వెలుగు: ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానాల నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు కొత్త కొత్త మార్గాలు అనుసరిస్తున్నారు. శనివారం ఐటీ కారిడార్‌లో వాహనాల తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు ఓ బైకర్ చేసిన మాయాజాలం చూసి ఆశ్చర్యపోయారు. రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు గచ్చిబౌలిలో ఆదివారం ఉదయం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సైనిక్‌పురికి చెందిన కమ్రాన్‌(28) డ్యూక్ బైక్‌ ను ఆపి పరిశీలించారు. బైక్ ముందు నంబర్‌ ప్లేట్ లేకపోవడంతో వెనుక భాగాన్ని పరిశీలించగా నంబర్‌ ప్లేట్‌కు మ్యాగ్నెట్ అమర్చి ఉంది. నంబర్​ప్లేట్​ను లోపలికి మలిస్తే అది పైన అతుక్కునేలా దీనిని ఏర్పాటు చేశాడు.  సీటుపై కూర్చుని నంబర్​ ప్లేట్​ను హ్యాండిల్​ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జరిమానాలు తప్పించుకునేందుకు ఇలా ఎత్తుగడ వేయడంతో పోలీసులు ఖంగు తిన్నారు. బైక్‌ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.