తమిళ సినిమా ఇండస్ట్రీ పెద్ద మార్పుకు నాంది పలికింది. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) మిడ్ బడ్జెట్ మరియు భారీ బడ్జెట్ సినిమాల్లో నటులకు ఇచ్చే ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ విధానాన్ని రద్దు చేసి, రెవెన్యూ షేరింగ్ మోడల్ అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా నటులు మరియు టాప్ టెక్నీషియన్లు ముందే నిర్ణయించిన పారితోషికం తీసుకునే విధానం ఉండేది. కానీ కొత్త విధానంలో, హీరోలు, నటీనటులు మరియు కీలక సాంకేతిక నిపుణులు సినిమా లాభాలు-నష్టాల్లో భాగస్వాములు అవుతారు. అంటే సినిమా సక్సెస్ని బట్టి, వారి రెమ్యునరేషన్ కూడా అలాగే ఉంటుంది.
అయితే, సినిమా ప్లాప్ అయితే.. ఆ నష్టాన్ని కేవలం నిర్మాతలు డిస్ట్రీబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ మాత్రమే ఫేస్ చేస్తున్నారు. హీరోలు మాత్రం కోట్ల రెమ్యునరేషన్లు తీసుకుని సేఫ్ జోన్ లోకి వెళ్లిపోతున్నారు. ఇక ఆ సంప్రదాయానికి చెక్ పెట్టి నిర్మాతలు పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది.
మే 2న టోకెన్ స్ట్రైక్..
ఈ నిర్ణయానికి మద్దతుగా TFPC మే 2న ఒక రోజు టోకెన్ స్ట్రైక్ ప్రకటించింది. ఇది ప్రస్తుతానికి హెచ్చరికగా మాత్రమే ఉంటుందని, కానీ నటుల సంఘం (నడిగర్ సంఘం) ఈ విధానానికి సహకరించకపోతే, ఈ సమ్మెను నిరవధికంగా కొనసాగించే అవకాశముందని కౌన్సిల్ హెచ్చరించింది. ఈ నిర్ణయం వల్ల కేవలం నటులకే కాదు, వేలాది టెక్నీషియన్లు, కార్మికులు మరియు సినిమా రంగంపై ఆధారపడిన వారికి కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
అయితే, ఇది మొదటిసారి కాదు. 2025లో జరిగిన సమావేశంలో కూడా TFPC ఇదే రెవెన్యూ షేరింగ్ విధానాన్ని ప్రతిపాదించింది. అప్పట్లో కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, ధనుష్, శివకార్తికేయన్, సిలంబరసన్ TR, విశాల్ వంటి స్టార్ హీరోలను ఈ మార్పుకు సహకరించాలని కోరింది. అయితే ఈ నిబంధనలు తమ వ్యాపారాన్ని, స్వేచ్ఛగా పని చేసే హక్కును దెబ్బతీస్తాయని నిర్మాతలు భావిస్తున్నారు. కానీ, అందరికీ సమతుల్యమైన విధానం ఉండాలని TFPC పేర్కొంది.
మే 10న కీలక సమావేశం..
ఈ సమస్య కేవలం తమిళ పరిశ్రమకే పరిమితం కాదు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నిర్మాతలు కూడా కలిసి ఈ అంశంపై చర్చించేందుకు ముందుకొస్తున్నారు. 2026 మే 10న ఒక ముఖ్యమైన సమావేశం జరగనుంది. అందులో సంయుక్త నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే, నాలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైన తేదీ నుంచి సినిమాల విడుదల నిలిపివేయాలని కూడా ఆలోచనలు జరుగుతున్నాయి. మరి ఈ పరిస్థితి ఎలాంటి ప్రభావం చూపిస్తోందో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. .
#Breaking_News 🚨
— Kolly Corner (@kollycorner) April 26, 2026
Tamil Film Producers Council (TFPC) is taking a stand! On May 2, 2026, they will initiate a token strike to push for revenue‑sharing agreements with actors 😯
Will Tamil Cinema’s top actors agree to this ❓ pic.twitter.com/p08L6wkHYY
8 వారాల OTT నిబంధన..
థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన కొత్త డిమాండ్లు ఇలా ఉన్నాయి. థియేటర్ కి వచ్చిన సినిమాలు.. OTTలో ఎప్పుడు విడుదల కావాలనే విషయంపై ఒక నిర్ణయానికి వచ్చారు. భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో విడుదలైన తర్వాత 6-8 వారాల తర్వాతే OTTలో విడుదల కావాలి. ఇక మిడ్ బడ్జెట్ సినిమాలకు 6 వారాల గ్యాప్, చిన్న సినిమాలకు తక్కువ సమయం ఇవ్వనున్నారు.
అదేవిధంగా, కౌన్సిల్‌కు సమాచారం ఇవ్వకుండా OTT ఒప్పందాలు చేసుకునే నిర్మాతలకు ఇండస్ట్రీ మద్దతు ఉండదని హెచ్చరించింది. ఇకపోతే, ప్రస్తుతం 4 వారాల్లోనే సినిమాలు OTTలో వస్తుండగా, ఈ మార్పు నిర్మాతలకు నష్టం చేస్తుందని TFPC పేర్కొంది.

