‘కొరియన్ కనకరాజు’ చిత్రం కంటెంట్‌పై ఉన్న కాన్ఫిడెన్స్‌తో ఒక రోజు ముందుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేస్తున్నామని, తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుందని హీరో వరుణ్ తేజ్ అన్నారు. ఆయన హీరోగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా భీమవరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాతో థియేటర్లలో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ఉండబోతోంది. కచ్చితంగా ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తారు. గాంధీ చాలా మంచి కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్. ఈ చిత్రంతో తన కెరీర్‌లో మరో పెద్ద హిట్ రాబోతోంది. నన్ను చాలా కొత్తగా చూపించాడు.
రితిక ఈ సినిమాతో తన సక్సెస్ జర్నీ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా. సత్య క్రేజీ కమెడియన్. కథ వినగానే ‘కృష్ణప్ప’ పాత్రలో తను తప్ప మరెవరూ గుర్తు రాలేదు. మా ఇద్దరి కాంబినేషన్ అలరిస్తుంది. తమన్‌తో ఇది మూడో సినిమా. తన మ్యూజిక్‌తో ప్రాణం పోశాడు. టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అభిమానులు గర్వపడే సినిమా అవుతుంది. ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తారు.
చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది’ అని చెప్పాడు. ఇందులో పోషించిన చైత్ర పాత్ర తన కెరీర్‌లో గుర్తుండిపోతుందని హీరోయిన్ రితిక నాయక్ చెప్పింది. ఇందులో ఒక మంచి పాట పాడానంటూ నల్గొండ గద్దర్ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా చాలా బాగా వచ్చిందని, అందరికీ తప్పకుండా నచ్చుతుందని తమన్ చెప్పాడు.
