ఓలా, ఉబర్ యాప్లు నిషేధించాలి : క్యాబ్ డ్రైవర్లు

 ఓలా, ఉబర్ యాప్లు నిషేధించాలి : క్యాబ్ డ్రైవర్లు
  • ఖైరతాబాద్​ ఆర్టీఏ ఆఫీస్​ వద్ద క్యాబ్​ డ్రైవర్ల ఆందోళన

పంజాగుట్ట, వెలుగు: డ్రైవర్ల సంపాదనను ఓలా, ఉబర్ వంటి సంస్థలు దోచుకుంటున్నాయని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద క్యాబ్ డ్రైవర్లు శనివారం ధర్నా చేపట్టారు. తక్షణమే ఈ యాప్​లను నిషేధించి తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

డ్రైవర్ యూనియన్ నాయకులు సతీశ్ బాబు, కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటుతోపాటు నగరంలో పార్కింగ్ స్థలాల కేటాయించాలని డిమాండ్​ చేశారు. ఆందోళనలో సీఐటీయు నాయకులు అజయ్ బాబు, సిద్దార్థ్ గౌడ్, డ్రైవర్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.