ప్రభుత్వ ఆస్తుల సీజ్‌పై విదేశీ కోర్టులకు కెయిర్న్

 ప్రభుత్వ ఆస్తుల సీజ్‌పై విదేశీ కోర్టులకు కెయిర్న్

న్యూఢిల్లీ: విదేశాల్లోని ప్రభుత్వ ఆస్తులు సీజ్ చేసి, 1.2 బిలియన్ డాలర్లను రికవర్ చేసేందుకు యూకే కంపెనీ కెయిర్న్ రెడీ అవుతోంది. కెయిర్న్ ప్రభుత్వం మధ్య నడిచిన ట్యాక్స్ కేసులో కంపెనీకి అనుకూలంగా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ తీర్పు (అవార్డ్) ఇచ్చింది. కాగా, ట్యాక్స్ కట్టించుకునేందుకు 1.2 బిలియన్ డాలర్లు విలువైన కంపెనీకి చెందని షేర్లను, డివిడెండ్లను, ట్యాక్స్ రీఫండ్లను ప్రభుత్వం సేల్ చేసిన విషయం తెలిసిందే. ఈ అవార్డ్ను ఇండియన్ గవర్నమెంట్ ఫాలో కాలేదు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన అవార్డ్ను యూఎస్,యూకే,కెనడా, ఫ్రాన్స్, సింగపూర్, నెదర్లాండ్, ఇంకో మూడు దేశాల కోర్టులలో కెయిర్న్ రిజిస్టర్ చేసింది. కాగా, విదేశాల్లో ప్రభుత్వ ఆస్తులను సీజ్ చేయాలంటే అక్కడి కోర్టులలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన అవార్డ్ ను రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఆయిల్ అండ్ గ్యాస్, షిప్పింగ్, ఎయిర్ లైన్, బ్యాంకింగ్ సెక్టార్ కు చెందిన ప్రభుత్వం ఆస్తులను సీజ్ చేసిన 1.2 బిలియన్ డాలర్లను రికవర్ చేయాలని కెయిర్న్ ప్రయత్నిస్తోంది.