
జీడిమెట్ల, వెలుగు: చదువులో రాణించలేకపోతున్నానని, ఆరోగ్యం సరిగా ఉండడం లేదనే మనస్తాపంతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్ర, నాందేడ్‌కి చెందిన లక్ష్మణ్ బతుకు దెరువు కోసం వచ్చి గుండ్ల పోచంపల్లిలో కూలీగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఇతని రెండో కూతురు, కొడుకు ఇద్దరూ మహారాష్ట్రలోతన తమ్ముడు లక్ష్మణ్ వద్ద ఉండి చదువుకుంటున్నారు. రెండో కూతురు రుతుజ (15) పదో తరగతి చదువుతోంది. సెప్టెంబర్ 20వ తేదీన మహరాష్ట్ర నుంచి గుండ్లపోచంపల్లిలోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. తాను సక్రమంగా చదవలేకపోతున్నానని, ఆరోగ్యం బాగాలేదంటూ తరచూ బాధపడేది. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.