
దేవీపట్నం: నాలుగు రోజుల క్రితం గోదావరిలో బోల్తా పడిన పడవ ఆచూకీని బుధవారం గుర్తించారు. సోనార్ (నీటిలోకి తరంగాలు పంపి వస్తువు ఉందా లేదా అని కనిపెట్టడం) సిస్టమ్ ద్వారా పడవ జాడను కనిపెట్టారు. 70-80 మీటర్ల లోతులో బోటు జాడను ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం గుర్తించింది. దీంతో ఈ బోటును బయటకు ఎలా తీయాలనే దానిపై ఉత్తరాఖండ్ బృందంతో ఏపీ రాష్ట్ర అధికారులు చర్చిస్తున్నారు.