ఓనర్ ఇంట్లో కార్‌‌‌‌ డ్రైవర్ 2.5కోట్లు లూటీ

ఓనర్ ఇంట్లో కార్‌‌‌‌ డ్రైవర్ 2.5కోట్లు లూటీ

కార్‌‌‌‌ డ్రైవర్‌‌‌‌, గార్డెనీర్‌‌స్కెచ్‌
పనిలో నుంచి తీసేశాడని కక్ష
హైదరాబాద్‌‌,వెలుగు: యజమాని ఇంట్లో భారీ చోరీ చేసిన ముఠాను గోల్కొండ పోలీసులు అరెస్ట్ ‌‌చేశారు. సీపీ అంజనీ కుమార్ ‌‌‌‌తెలిపిన ప్రకారం.. టోలిచౌకి బాల్‌‌రెడ్డి నగర్‌‌‌‌కి చెందిన అసదుద్దీన్‌‌ అహ్మద్‌‌(54) రియల్టర్. ఆయనకి శామీర్ పేటలో ఫామ్ హౌస్ ఉంది. కార్‌‌‌ డ్రైవర్‌‌‌‌గా టోలిచౌకి అక్బర్ ‌‌‌‌బాగ్ ‌‌ఎండీ లైన్‌‌కి చెందిన మహ్మద్ ‌‌అఫ్సర్‌‌‌‌(24) పని చేస్తున్నాడు. అదే ఏరియాకి చెందిన మీర్జాబేగ్‌‌(23)ను గార్డెనీర్డెర్‌‌‌‌గా పెట్టుకున్నాడు. గత నెల మొదటి వారంలో వారిద్దరినీ పని నుంచి తొలగించాడు. అసద్‌‌పై కక్ష పెంచుకున్న ఆ ఇద్దరు అతని ఇంట్లో క్యాష్ కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. తన చిన్ననాటి ఫ్రెండ్స్ ‌‌అయిన రెహమాన్‌‌బేగ్‌‌(23), మహ్మద్ ‌‌అమీర్‌‌‌‌(20), సయ్యద్ ‌‌ఇమ్రాన్‌‌(23)తో కలిసి గ్యాంగ్ ‌‌ఏర్పాటు చేశాడు.

జులై 21న అసద్ ‌ఫ్యామిలీతో ఫామ్‌హౌస్ కి వెళ్లి విషయం తెలుసుకుని 22 రాత్రి చోరీ చేశారు. 2.5 కోట్లు 2 రైస్ ‌‌బ్యాగుల్లో నింపుకొని పరారయ్యారు. దొంగిలించిన డబ్బులో కొంత పంచుకుని మిగిలిన మొత్తాన్నిరెహమాన్‌ ఇంట్లో దాచారు. 27న ఫామ్‌హౌస్ నుంచి తిరిగొచ్చిన అసద్‌ గోల్కొండ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు అఫ్సర్ ‌‌‌గ్యాంగ్‌‌ ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.28కోట్లు, బైక్‌, మొబైల్ ‌‌ఫోన్ ‌స్వాధీనం చేసుకున్నారు.

మ‌రిన్ని వార్తల కోసం