
మియాపూర్, వెలుగు:మియాపూర్, వెలుగు: రన్నింగ్ కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. మెదక్ జిల్లా మనోహరాబాద్మండలం కుంచారం గ్రామానికి చెందిన దుర్గం అరుణ్కుమార్శనివారం తన కారులో ఫ్రెండ్‌తో కలిసి పటాన్చెరు వెళ్లాడు. సాయంత్రం 6 గంటలకు మేడ్చల్బయలుదేరాడు. మియాపూర్మెట్రో స్టేషన్ సమీపంలోకి రాగానే వీరి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అరుణ్‌కుమార్, అతని ఫ్రెండ్‌తో వెంటనే పక్కకు ఆపి, కారు దిగి ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. అయితే క్షణాల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. మెట్రో సిబ్బందిని సాయమడిగినా స్పందించలేదని, ఫైర్ ఆర్పే సామాగ్రి ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని అరుణ్‌కుమార్ వాపోయాడు.