
చిత్తూరు జిల్లా గంగవరం మండలం మామడుగు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో మంటలు చెలరేగి ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఒకరు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డడారు. బెంగళూరు నుంచి పలమనేరు వెళ్తుండగా కారు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు.
వాహనంలో ఉన్న 5 మందిలో నలుగురు సజీవదహనం కాగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.