
హైదరాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పై కారు పల్టీలు కొట్టింది . మెహదీపట్నం వైపు నుంచి లంగర్ హౌస్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న వ్యక్తికి ఎలాంటి ప్రాణహాని కలగలేదు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయ్యింది.
ఈ ప్రమాదంతో ప్లై ఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. కారులో ఉన్న వ్యక్తికి గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. నుజ్జనుజ్జ అయిన కారును పోలీసులు క్రేన్ సాయంతో పీఎస్ కు తరలించారు. డ్రైవింగ్ చేసేటపుడు మద్యం సేవించాడా లేక అతి వేగంతో ప్రమాదం జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.
హైదరాబాద్ లో ఈ మధ్య ర్యాష్ డ్రైవింగ్ లో చాలా జరుగుతున్నాయి.మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు.