హైదరాబాద్, వెలుగు: టెన్త్, ఇంటర్ తర్వాత ఏ కోర్సు ఎంచుకోవాలన్నది తేల్చుకోలేక చాలా మంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటి విద్యార్థులకు ఎడ్యుకేషన్‌పై సరైన గైడెన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. యునిసెఫ్, నిర్మాణ్ అనే ఎన్జీవోతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం, సమగ్రశిక్షలు కెరీర్ గైడెన్స్‌కు టోల్‌ఫ్రీ నంబర్ 1800 4252428ను ప్రారంభించాయి.
సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటలదాకా ఈ నంబర్ పనిచేస్తుంది. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌ను అందించనున్నారు. కేజీబీవీలు, పీఎంశ్రీ స్కూల్స్, తెలంగాణ మోడల్ స్కూల్స్, గురుకులాల్లో చదివే విద్యార్థులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
టెన్త్, ఇంటర్ తర్వాత ఉన్నత విద్యావకాశాలు, ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలి వంటి విషయాలపై పిల్లలకు మార్గనిర్దేశం చేయనున్నారు. దాంతోపాటు స్కిల్స్ పెంచుకునేందుకు ఉన్న మార్గాలు, స్కాలర్షిప్ స్కీముల వంటి వాటి మీదా అవగాహన కల్పిస్తారు.
