బ్రాహ్మణులను కించపరిచేలా వ్యాఖ్య‌లు.. యాంక‌ర్ శ్రీముఖిపై కేసు

బ్రాహ్మణులను కించపరిచేలా వ్యాఖ్య‌లు.. యాంక‌ర్ శ్రీముఖిపై  కేసు

హైదరాబాద్: యాంకర్ శ్రీముఖిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జెమినీ టీవీలో ప్రసారమైన “జూలకటక” అనే ప్రొగ్రామ్ కి యాంకర్ గా వ్యవహరించిన శ్రీముఖి .. ఆ కార్య‌క్ర‌మంలో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలా, కించపరిచేలా వ్యాఖ్యలు చేసిందని వెంక‌ట ర‌మ‌ణ శర్మ అనే వ్య‌క్తి సోమ‌వారం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. శ్రీముఖితో పాటు సదరు టీవీ ఛానెల్ యాజమాన్యంపైనా ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో స‌ద‌రు బ్రాహ్మణలు మాజీ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చొరవతో మంగ‌ళ‌వారం జెమినీ టీవీ సీఈఓ కిరణ్ తో చర్చించామని అన్నారు. ఈ కార్యక్రమంపై ఆయన విచారం వ్యక్తం చేశార‌ని తెలిపారు. వెంటనే యూట్యూబ్ నుంచి ఆ ఎపిసోడ్ ను తొలగిస్తానని., భవిష్యత్తులో బ్రాహ్మణులను కించపరిచే కార్యక్రమాలు రూపొందించమని, ఈ కార్యక్రమం విషయంలో మనోభావాలు దెబ్బతిన్న బ్రాహ్మణులకు క్షమాపణలు చెబుతున్నానని జెమినీ టీవీ సీఈఓ కిరణ్ లిఖితపూర్వకంగా తెలియజేసారని తెలిపారు. తాము పెట్టిన కేసుపై బ్రాహ్మణ పెద్దల సూచనల మేరకు త‌మ‌ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని వెల్ల‌డించారు.