ఆరున్నరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్.. ఎస్‌ఐపై నార్సింగిలో కేసు నమోదు

ఆరున్నరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్.. ఎస్‌ఐపై నార్సింగిలో కేసు నమోదు

హైదరాబాద్‌లో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి. తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన ఒక పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదైంది. కేవలం ఆరున్నరేళ్ల తన మనవరాలితో కారు నడిపించిన ఎస్‌ఐ పూజారి తిరుపతిపై నార్సింగి పోలీసులు కేసు  నమోదు చేశారు.

జులై 11వ తేదీ సాయంత్రం ఐదు గంటల సమయంలో, గండంగూడ–బైరాగిగూడ రోడ్డుపై తన సొంత కారులో మైనర్ మనవరాలిని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి కారు నడిపించారు ఎస్‌ఐ తిరుపతి. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో కూడా చర్చనీయాంశం కావడంతో నార్సింగి పోలీసులు స్పందించారు.
 

ఎస్‌ఐ తిరుపతిపై క్రైమ్ నంబర్ 1313/2026 కింద.. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 125తో పాటు, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్లు 184, 180 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కారుపై దాదాపు రూ.4వేలు చలాన్లు కూడా ఉన్నాయి