జీడిమెట్ల, వెలుగు: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌరంపేట్జరిగిన భూమి వివాదంలో ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. భౌరంపేట్‌లో ఓ ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు కేటాయించిన భూమిపై గత కొంతకాలంగా వివాదం నెలకొంది. ఎక్స్ సర్వీస్ మెన్ నుంచి భూమిని కొనుగోలు చేసిన జీవేందర్ రెడ్డి ఆదివారం తన స్థలాన్ని చదును చేయిస్తుండగా, కొంతమంది అక్కడికి చేరుకుని అడ్డుకోవడంతో గొడవ మొదలైంది.
జీవేందర్ రెడ్డి 100కు కాల్ చేసి ఫిర్యాదు చేయగా, ఇరువర్గాల వాదనలు విన్న పోలీసులు పరస్పర ఫిర్యాదుల మేరకు జీవేందర్ రెడ్డితో పాటు ప్రభాకర్ రెడ్డిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
