హైదరాబాద్ సిటీలో వెలుగులోకి వెట్టి చాకిరీ : రూ.3 లక్షల అప్పుకు నాలుగేళ్లుగా భార్యాభర్తలు నిర్బంధం

హైదరాబాద్ సిటీలో వెలుగులోకి వెట్టి చాకిరీ : రూ.3 లక్షల అప్పుకు నాలుగేళ్లుగా భార్యాభర్తలు నిర్బంధం

హైదరాబాద్ సిటీలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ కాలంలోనూ వెట్టి చాకిరి ఉందా అంటూ జనం అంతా అవాక్కయ్యారు. మియాపూర్ లో జరిగిన ఈ దారుణం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

40 ఏళ్ల కోట శ్రీనివాస్, అతని భార్య రమ్య ఇద్దరూ భార్యభర్తలు. నాలుగేళ్ల క్రితం భార్య రమ్యకు అనారోగ్యం చేసింది. వైద్య ఖర్చుల కోసం తాను పని చేసే కాంట్రాక్టర్లు రాములు దగ్గర 2 లక్షలు, కృష్ణ దగ్గర లక్ష రూపాయలు.. మొత్తం 3 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బుతో భార్య రమ్యకు చికిత్స చేయించాడు భర్త శ్రీనివాస్. 

ఈ అప్పు తీర్చేందుకు కాంట్రాక్టర్లు రాము, కృష్ణ తమ దగ్గరే పని చేయాలని నిబంధన పెట్టారు. ఆ తర్వాత భార్యభర్తలు శ్రీనివాస్, రమ్యను మియాపూర్ న్యూ హఫీజ్ పేట్ లోని ప్రేమ్ నగర్ ఏరియాలో వాళ్లు నిర్మిస్తున్న ఓ బిల్డింగ్ దగ్గర పనికి పెట్టారు. అక్కడే వాళ్లను నిర్బంధించారు. 

3 లక్షల రూపాయల అప్పు తీర్చటం కోసం నాలుగేళ్లుగా.. ఈ దంపతులతో పని చేయించుకుంటున్నారు. ఈ నాలుగేళ్లుగా ఆ దంపతులు అక్కడే పని చేస్తున్నా.. ఇంకా 3 లక్షల అప్పు తీరలేదంట.. ఈ విషయం తెలిసిన ఓ రెవెన్యూ శాఖ అధికారి మియాపూర్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. స్పాట్ కు వచ్చి విచారణ చేసిన పోలీసులు.. నాలుగేళ్లుగా నిర్బంధించి వెట్టిచాకిరి చేయించుకుంటున్నట్లు స్పష్టం అయ్యింది.

ALSO READ :  రామ చిలుక బద్ధకం చూపించి..

వెట్టి చాకిరీ చేయించుకున్నట్లు నిర్థారణ కావటంతో కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాంట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. భార్యభర్తలు శ్రీనివాస్, రమ్యను వారి దగ్గర నుంచి విముక్తి కల్పించారు. ఇద్దరు వ్యక్తులు.. నాలుగేళ్లుగా వాళ్ల దగ్గరే పని చేస్తున్నా.. 3 లక్షల రూపాయలు అప్పు తీరకపోవటం ఏంటంటూ షాక్ అయ్యారు పోలీసులు. మనుషులను బానిసలుగా చూడటం.. వెట్టి చాకిరీ చేయించటం అనేది తీవ్రమైన నేరం అని.. ఈ కాలంలోనూ ఇలా ప్రవర్తించే మనుషులు ఉండటంపై ఆశ్చర్యపోతున్నారు పోలీసులు. కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు పోలీసులు.