ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల విషయంలో కూటమి ప్రభుత్వానికి .. ముద్రగడ కుటుంబసభ్యులు షాకి చ్చారు. అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని తెలిపారు. ఈరోజు ( జులై 15) సాయంత్రం కిర్లంపూడిలోనే ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు జరుపుతామని కుటుంబసభ్యులు వెల్లడించారు.
ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో జులై 14న కన్నుమూయడంతో.. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ముద్రగడ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన సేవలను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మాట్లాడిన అనంతరం సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే.. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని ముద్రగడ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. తమకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
