వాషింగ్ మిషన్ పేలుడు ఘటనలో LG కంపెనీపై కేసు నమోదు

వాషింగ్ మిషన్ పేలుడు ఘటనలో LG కంపెనీపై కేసు నమోదు

జూబ్లీహిల్స్ , వెలుగు: వాషింగ్ మిషన్ పేలిన ఘటనలో ఎల్జీ కంపెనీపై కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎస్సార్ నగర్ పరిధి ధరంకరం రోడ్​లోని కేకే ఎన్ క్లేవ్ అపార్ట్‌‌‌‌మెంట్ ఫ్లాట్ నెంబర్ 503లో రెండు రోజుల క్రితం ఎల్జీ కంపెనీకి చెందిన వాషింగ్ మెషిన్ పేలిన సంగతి తెలిసిందే. బాల్కనీలో వాసింగ్​మెషిన్ రన్నింగ్​లో ఉండగానే, భారీ శబ్దంతో బ్లాస్ట్ అయ్యిందని బాధితుడు వి.ఎస్.ఆర్. శాస్త్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎల్జీ కంపెనీపై ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.