కుల వివక్ష సమాజానికి మచ్చ : గజ్వేల్ ఎసీపీ నర్సింలు

కుల వివక్ష సమాజానికి మచ్చ : గజ్వేల్ ఎసీపీ నర్సింలు
  •     గజ్వేల్​ ఎసీపీ నర్సింలు

సిద్దిపేట, వెలుగు: సైన్స్​ అండ్​ టెక్నాలజీలో ప్రపంచం దూసుకుపోతున్న ఈ రోజుల్లో కుల వివక్ష సమాజానికి మచ్చలాంటిదని గజ్వేల్ ఎసీపీ కె.నర్సింలు అన్నారు. శుక్రవారం జగదేవ్‌‌పూర్ మండలం అనంతసాగర్ గ్రామాన్ని సందర్శించి కులవివక్ష ఘటనపై విచారించారు. అక్కడి పరిస్థితులను తెలుసుకొని సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. 

ఎస్సీ, ఎస్టీ వర్గాలపై కులవివక్ష, బెదిరింపులు, దాడులు జరిగితే చట్టం తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. కులాల పేరుతో దూషించడం, వివక్షకు పాల్పడితే చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జగదేవ్‌‌పూర్ ఎస్‌‌ఐ కృష్ణారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.