
అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ హాజరు మినహాయింపుపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. జగన్‌కు హాజరు నుండి మినహాయింపునిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సీబీఐ తెలిపింది. ఇదే కారణంతో హాజరుకు మినహాయింపునకు గతంలో కూడా CBI నిరాకరించినట్లు హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చింది. జగన్ హోదా పెరిగినందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పింది. ఈ కేసుకు సంబంధించి పదేళ్లయినా కేసులు ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉన్నాయని కోర్టుకు వివరించింది. హాజరు మినహాయింపు ఇస్తే విచారణలో మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉందని తెలిపింది. CBI వాదనలు విన్న హైకోర్టు...సీబీఐ కోర్టులో జగన్ హాజరు మినహాయింపు పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.