దేశవ్యాప్తంగా విద్యార్థులు ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో గందరగోళం కాగా.. రెండవది నీట్ పేపర్ లీక్ అంశం. సీబీఎస్ఈ ఇంటర్ ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఆందోళనకు అసలు కారణం వారి రాసిన దానికి వచ్చిన మార్కులకు అస్సలు సంబంధం లేకపోవటమే. చాలా మంది విద్యార్థులు ఈ సమస్య గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనిపై సామాజిక కార్యకర్తలు, వైద్యులు కూడా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
సీబీఎస్ఈ ఫైనల్ సంవత్సరం ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చిన చాలా మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం అప్లై చేస్తున్నారు. దీంతో వారు బోర్డ్ నుంచి తమ పరీక్ష పేపర్ ఫోటో కాపీలను పొంది క్రాస్ వెరిఫై చేసుకుంటున్నారు ఎందుకలా జరిగిందనే వివరాలు తెలుసుకునేందుకు. కానీ ఇక్కడే వారికి షాక్ తగులుతోంది. అప్లై చేసినవారికి బోర్డు అధికారులు పంపిన ఆన్సష్ షీట్స్ వేరే విద్యార్థులవని తమవి కావని స్టూడెంట్స్ చెబుతున్నారు. మరికొందరికి బోర్డు బ్లర్ కాపీలను పంపటం వాటిని కనీసం చదవటానికి కూడా వీలు కాకపోవటంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా బోర్డు చేసిన తప్పులను కవర్ చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నమా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు.
దీనిపై మీదుసా అనే డాక్టర్ కూడా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 40 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటిపై కాక్రోచ్ జనతా పార్టీ ప్రశ్నిస్తే గోడీ మీడియా తట్టుకోలేకపోతోందని ఆమె అన్నారు. 2026లో పాస్ పర్సంటేజ్ ఏకంగా 85 శాతానికి పడిపోయి 7 ఏళ్ల కనిష్టానికి చేరుకుందని ఆమె అన్నారు. చాలా మంది విద్యార్థులు కూడా తాము రాసిన పరీక్షకు వచ్చిన మార్కులకు సంబంధం లేకపోవటానికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఒక్కోసారి విద్యార్థులు పరీక్ష సరిగ్గా రాయకపోవటం వల్ల కూడా ఇలా జరుగుతుందిగా అని అనుకుంటారని.. అయితే లక్షల మంది విద్యార్థులకు ఒకేసారి ఇలా జరుగుతుందా అంటూ ఆమె ప్రశ్నించారు. ఈసారి ఆన్ స్కీన్ మార్కింగ్ విధానాన్ని తెచ్చిందని.. దీని ప్రకారం ఎగ్జామ్ కాపీలను స్కాన్ చేసి అప్ లోజ్ చేస్తారని, దానిని ఒక సాఫ్ట్ వేర్ ద్వారా మార్కింగ్ ప్రక్రియ టీచర్స్ పూర్తి చేస్తారని ఆమె వెల్లడించారు. ఇందులోనే ఎక్కడో తప్పు జరుగుతున్నట్లు ఆమె అభిప్రాయపడ్డారు.
అయితే ఇప్పుడు లక్షల మంది సీబీఎస్ఈ ఇంటర్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు తక్కువ మార్కులు రావటంతో రీవాల్యుయేషన్ కోసం అప్లై చేసుకుంటున్నారని.. అయితే ఆ సమయంలో బోర్టు అప్ లోడ్ చేస్తున్న ఆన్సర్ షీట్ స్కాన్ కాపీలు బ్లర్ గా కనీసం చదవటానికి కూడా వీలులేకుండా వస్తున్నాయని ఆమె తన వీడియోలో చూపించారు. ఇది ఖచ్చితంగా విద్యార్థుల జీవితంతో ఆడుకోవటమేనని, 18 లక్షల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. దేశ యువత జీవితాలతో ఆడుకోవటం అస్సలు కరెక్ట్ కాదంటున్నారు డాక్టర్ మెదుసా. దేశంలోని మీడియా కూడా ఈ సమస్యపై ప్రశ్నించకపోవటం, కనీసం రిపోర్ట్ కూడా చేయకుండా సైలెంట్‌గా ఉండటం సరికాదని ఆమె అన్నారు.
