సీబీఎస్‌‌ఈ రీ-వాల్యుయేషన్‌‌ కు ఒక్కరోజే 39 వేల దరఖాస్తులు

సీబీఎస్‌‌ఈ రీ-వాల్యుయేషన్‌‌ కు  ఒక్కరోజే 39 వేల దరఖాస్తులు

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌‌ఈ) నిర్వహించిన బోర్డు పరీక్షల ఆన్సర్‌‌‌‌ షీట్ల రీ-వెరిఫికేషన్‌‌, రీవాల్యుయేషన్ కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. బుధవారం మధ్యాహ్నం వరకు మొత్తం 43,980 దరఖాస్తులు అందినట్లు సీబీఎస్‌‌ఈ వెల్లడించింది. వీటిలో 4,924 రీ-వెరిఫికేషన్‌‌కు, 39,056 రీ-వాల్యుయేషన్‌‌కు వచ్చాయని బోర్డు తెలిపింది. 12వ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, ఆన్‌‌స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌‌ఎం) విధానంపై వచ్చిన సందేహాల నేపథ్యంలో రీ-వెరిఫికేషన్‌‌, రీవాల్యుయేషన్‌‌కు అవకాశం కల్పించింది. 

ఆన్‌‌లైన్‌‌లో అప్లికేషన్‌‌ను జూన్ 2న ప్రారంభించి, 6న అర్ధరాత్రి వరకు గడువు ఇచ్చింది. గడువు ముగిశాక వచ్చిన దరఖాస్తులను స్వీకరించబోమని బోర్డు తెలిపింది. స్కాన్ కాపీల్లో లోపాల పరిశీలనకు ఒక్కో సబ్జెక్ట్‌‌కు ఫీజు రూ.100, రీవాల్యుయేషన్‌‌కు ఒక్కో ప్రశ్నకు రూ.25 నిర్ణయించారు. ప్రతి విద్యార్థి రీ-వెరిఫికేషన్‌‌, రీవాల్యుయేషన్ కోసం ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించేందుకు చాన్స్‌‌ ఇచ్చారు. దరఖాస్తుల ఫీజును విద్యార్థులు యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చని బోర్డు స్పష్టం చేసింది.