వెటర్నరీ డాక్టర్ ఘటనపై..ఎవరేమన్నారంటే..

వెటర్నరీ డాక్టర్ ఘటనపై..ఎవరేమన్నారంటే..

షాద్ నగర్లో వెటర్నరీ డాక్టర్ హత్యపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. సంచలనం సృష్టించిన డాక్టర్ హత్యపై పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు స్పందించారు,

సిగ్గుచేటు..ఇక ముగింపు పలకాలి:  వీరాట్ కొహ్లీ

హైదరాబాద్ లో ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు.  సమాజంలో మనం బాధ్యతగా తీసుకుని ఇలాంటి ఘటనలకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది.

మాటలు కాదు చేతల్లో చూపించాలి: ప్రియాంక గాంధీ వాద్రా

‘హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్  అలాగే యూపీ సంబల్‌లోని టీనేజ్ బాలికపై జరిగిన లైంగిక దాడి అతి క్రూరమైనవి. ఈ ఘటనలు నన్నుకలిచివేశాయి. నా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి మాటలు సరిపోవడం లేదు. ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరిగినప్పుడు మాట్లాడటం కంటే మనం  చేయాల్సిందే ఎక్కువగా ఉంది‘.

ఇలాంటి ఘటనలకు పుల్ స్టాప్ పెట్టాలి:  అక్షయ్ కుమార్

హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ అయినా, తమిళనాడులో లాయర్ అయినా, రాంచీలో గ్యాంగ్ రేప్ అయినా  తీరు మారడం లేదు. నిర్భయం చట్టం తెచ్చి 7 సంవత్సరాలు అయినా ఇలాంటి ఘటనలు ఆగడం లేదు కదా. ఇంకా ఎక్కువవుతున్నాయి. ఇలాంటి ఘటనల వల్ల మనం సమాజాన్ని కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. ఇంకా కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ఇలాంటి ఘటనలను మనం ఆపాలి.

ఎంతో కలిచి వేసింది: పరిణితి చొప్రా

‘వెటర్నరీ డాక్టర్ ఘటన  నన్ను ఎంతో కలిచి వేసింది.  ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా‘. అని ట్వీట్ చేశారు.