
పుష్ప(Pushpa2) సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్(Allu arjun). ఏప్రిల్ 8న ఈ ఐకాన్ స్టార్ బర్త్ డే. ఈ హీరో పుట్టిన రోజును అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తుంటారు. రాఘవేందర్ రావు 2003లో తీసిన గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బన్నీ.
ఈ సినిమాలో లుక్స్ పరంగా విమర్శలు ఎదుర్కున్న బన్నీ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ఇండస్ట్రీని ఏలుతున్నాడు. బన్నీతో పాటుగా ఇదే రోజున అక్కినేని అఖిల్(Akkineni akhil) సైతం పుట్టిన రోజును షేర్ చేసుకుంటున్నాడు. ఇదే నెలలో వస్తున్న ఏజెంట్ సినిమా ఈ హీరోకు కీలకంగా మారనుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pavan kalyan) కుమారుడు అకీరా నందన్ బర్త్ డే ఇదే రోజు కావడం విశేషం. పెదనాన్న చిరంజీవి అకీరాకు ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. జూనియర్ పవర్ స్టార్ అంటూ పీకే అభిమానులు సైతం ట్వీట్లు పెడుతూ విష్ చేస్తున్నారు.
అలా మొదలైంది అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిత్యామీనన్. సింగర్ గానూ మంచి పేరు తెచ్చుకుంది. హీరోయిన్ టబు కు చెల్లెలిగా నటించిన ఒకప్పటి బాల నటి ఇప్పుడు ఇంత ట్యాలెంటెడ్ హీరోయిన్ అవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరేమో.