C-DACలో 805 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు: బీటెక్, ఎంటెక్ చేసినోళ్లకు ఛాన్స్.. ఎలాంటి ఫీజు లేదు!

 C-DACలో 805 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు: బీటెక్, ఎంటెక్ చేసినోళ్లకు ఛాన్స్.. ఎలాంటి ఫీజు లేదు!

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్​డ్ కంప్యూటింగ్ (సి - డాక్) ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 20. 

ఖాళీలు: 805 ( ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, ఇతర పోస్టులు). సి–డాక్ బెంగళూరు 93, చెన్నై 97, ఢిల్లీ 20, హైదరాబాద్ 105, కోల్​కతా 15, ముంబయి 27, నోయిడా 283, పుణె 65, తిరువనంతపురం 73, సెంటర్ ఇన్ నార్త్ ఈస్ట్ 27.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బి.టెక్. లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.  ఎంఈ/ ఎం.టెక్. లేదా సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. సంబంధిత విభాగంలో పీహెచ్​డీ పూర్తిచేసి ఉండాలి. 
 
వయోపరిమితి: పోస్టులను అనుసరించి వేర్వేరు వయోపరిమితులు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు నిర్దిష్ట నోటిఫికేషన్ చూడగలరు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 01.
 
ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 20. 

సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థుల ఎంపిక వారి విద్యార్హతలు, అనుభవ వివరాలు, రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

పూర్తి వివరాలకు cdac.in వెబ్​సైట్​ను సందర్శించండి.