తెలంగాణకు రూ.2,682 కోట్లు

తెలంగాణకు రూ.2,682 కోట్లు

తెలంగాణకు రూ.2,682 కోట్లు

14వ విడత పన్నులను విడుదల చేసిన కేంద్రం

న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణకు రూ.2,682 కోట్లను పన్నుల్లో వాటాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలోని 28 రాష్ట్రాలకు 14వ విడత పన్ను పంపిణీగా మార్చి నెలలో రూ.1,40,318 కోట్ల మొత్తాన్ని కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రాలు తమ అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేసేందుకు ఈ నిధుల్ని విడుదల చేశామని పేర్కొంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు రూ.5,474 కోట్లను రిలీజ్ చేసింది.