‘కూ’యాప్ తో జతకట్టిన CIIL

‘కూ’యాప్ తో జతకట్టిన CIIL

 సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు భాష ఉపయోగాన్ని ప్రోత్సహించడానికి మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారం కూ  యా ప్ తో.. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (CIIL) అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. భారతీయ భాషల అభివృద్ధిని సమన్వయం చేయడానికి భారత ప్రభుత్వంచే స్థాపించబడిన CIIL, యాప్ యొక్క కంటెంట్ నియంత్రణ విధానాలను బలోపేతం చేయడానికి, అలాగే యూజర్లకు ఆన్‌లైన్‌లో సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి "కూ" తో కలిసి పని చేయనుంది. ఆన్‌లైన్ బెదిరింపుల వాతావరణం నుండి యూజర్లకు రక్షణ కల్పించడానికి, పారదర్శకమైన ప్లాట్‌ఫారం రూపొందించడానికి ఈ ఒప్పందం సహాయపడుతుంది.

ఈ సందర్భంగా మాట్లాడిన  కూ యాప్ సహ వ్యవస్థాపకుడు & CEO రాధాకృష్ణ మాట్లాడుతూ.. “భారతీయులు బహుళ భాషల్లో మాట్లాడేందుకు, కనెక్ట్ అవ్వడానికి వీలు కల్పించే ఒక ప్రత్యేకమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫారంగా దుర్వినియోగాన్ని అరికడతామన్నారు. ఆన్‌లైన్‌ వాతావరణాన్ని మెరుగుపరచడం ద్వారా మాయూజర్లను మరింత బలోపేతం చేయడానికి తాము ప్రయత్నిస్తున్నామన్నారు.