రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి లేఖ

రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి లేఖ

సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖలు రాశారు. ఈ లిబరేషన్‌ డేను సెప్టెంబర్ 17, 2022 నుంచి సెప్టెంబర్ 17, 2023 అంటే ఏడాది పాటు నిర్వహించాలని నిర్ణయించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గెస్ట్ ఆఫ్ హనర్‌గా హాజరు కావాలని కిషన్ రెడ్డి ఆహ్వానం పలికారు. తెలంగాణ సీఎంతో పాటు, మహారాష్ట్ర సీఎం ఎక్ నాథ్ షిండే, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైలకు సైతం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖలు రాశారు.