క్రూడాయిల్ ధరలు తగ్గినా.. పెట్రోల్ ధరలు తగ్గించలేం: పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి

క్రూడాయిల్ ధరలు తగ్గినా.. పెట్రోల్ ధరలు తగ్గించలేం: పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి

త్రిస్సూర్: అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ దేశీయంగా ఇంధన ధరలను వెంటనే తగ్గించడం సాధ్యం కాదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి స్పష్టం చేశారు. చమురు ధరల తగ్గింపు వెనుక రవాణా ఇబ్బందులతో పాటు అనేక అంశాలు ఉంటాయన్నారు. ఇటీవల పెరిగిన ధరల్లో లీటరుకు రూ.3.94 మాత్రమే ప్రభావం చూపించిందని, అంతర్జాతీయంగా ధరలు తగ్గినంత మాత్రాన దాన్ని వెంటనే వెనక్కి తీసుకోలేమని చెప్పారు. 

తక్కువ ధరకు కొనుగోలు చేసిన ముడిచమురు 'హార్మూజ్ జలసంధి' మీదుగా భారతదేశానికి రావడానికి సమయం పడుతుందన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చమురు కంపెనీలపై పడిన రూ.12,000 కోట్ల ఆర్థిక భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించిందని మంత్రి వెల్లడించారు. ధరలు పెరిగినప్పుడు ఏ రాష్ట్రం కూడా పన్నులు తగ్గించుకోలేదన్నారు.