ఎల్బీనగర్, వెలుగు: నడుస్తూ వెళ్తున్న ఓ మహిళ మెడలోని పుస్తెల తాడును ముగ్గురు దుండగులు లాక్కొని పారిపోయారు. ఈ ఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారంలో చోటుచేసుకుంది. జీవీఆర్ కాలనీకి చెందిన సగ్గం ధనమ్మ మంగళవారం సాయంత్రం పని మీద బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా.. బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల పుస్తెల తాడును లాక్కొని పరారయ్యారు.
బాధితురాలి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వనస్థలిపురం ఏసీపీ కాశి రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపామని, సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
