
చైతన్య రావు, లావణ్య జంటగా సునీల్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘వాలెంటైన్స్ నైట్’. అనిల్ గోపిరెడ్డి దర్శకుడు. తృప్తి పాటిల్, సుధీర్ యాళంగి మహీందర్ నిర్మాతలు. ఈ మూవీ ట్రైలర్‌ను యాక్టర్ కమ్ రైటర్ హర్షవర్ధన్ లాంచ్ చేసి.. ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగిందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చైతన్య రావు మాట్లాడుతూ ‘ఇదొక ఇంటరెస్టింగ్ స్టోరీ. చాలెంజింగ్ క్యారెక్టర్ చేశాను. ఇందులో నటించిన సునీల్‌కి స్పెషల్ థ్యాంక్స్. అందరూ సపోర్ట్ చేస్తారని కోరుతున్నా’ అన్నాడు.
థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా అని చెప్పింది లావణ్య. అనిల్ గోపిరెడ్డి మాట్లాడుతూ ‘మన జీవితం మన చేతిలో ఉండదు. ఒక నిర్ణయం తీసుకుంటే అవతలి వారి జీవితం మీద కూడా ప్రభావం పడు తుంది. 14 పాత్రల మధ్య వాలెంటైన్స్ నైట్ ఏం జరిగిందనేది కథ. చాలా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో కొత్త కాన్సెప్ట్‌తో మీ ముందుకు వస్తున్నాం’ అని చెప్పాడు. నిర్మాత సుధీర్, నటులు ముక్కు అవినాష్, కార్తిక్, లోబో, చరణ్, స్వాతి రాపేటి తదితరులు పాల్గొన్నారు.