రాహుల్ ప్రధాని కావాలా.. వద్దా?  నిర్ణయించాల్సింది ప్రజలే : ఎంపీ చామల

రాహుల్ ప్రధాని కావాలా.. వద్దా?  నిర్ణయించాల్సింది ప్రజలే : ఎంపీ చామల

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని కావాలా, వద్దా..అనేది దేశ ప్రజలు నిర్ణయిస్తారని, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్​కాదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం  గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రాహుల్ గాంధీ మొదటిసారి ఎంపీగా ఎన్నికైన సమయంలో బండి సంజయ్ కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కూడా గెలవలేదన్నారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విమర్శించే స్థాయి ఎక్కడిదని ప్రశ్నించారు. పదేండ్ల పాటు తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుంటే కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ఫైర్ అయ్యారు.