చందానగర్, వెలుగు: ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఐస్క్రీమ్ తయారీ కేంద్రాన్ని చందానగర్ పోలీసులు సీజ్ చేశారు. చందానగర్ జవహర్ కాలనీలో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ‘బెస్ట్ ఐస్‌క్రీమ్’ పేరుతో తయారీ కేంద్రాన్ని నడుపుతున్నాడు. దీనిపై శేరిలింగంపల్లి ఎస్ఓటీ పోలీసులు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, చందానగర్ పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. ఐస్క్రీమ్తయారీకి సంబంధించి ఎలాంటి లైసెన్సులు లేకపోవడంతో నిర్వహకుడిని అదుపులోకి తీసుకుని, భారీగా నిల్వ ఉంచిన ఐస్క్రీమ్సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

