పన్ను ఎగవేత కేసు.. బీజేపీ ఎంపీ సురేష్ గోపిపై ఛార్జ్ షీట్

పన్ను ఎగవేత కేసు.. బీజేపీ ఎంపీ సురేష్ గోపిపై ఛార్జ్ షీట్

లగ్జరీ కారు ట్యాక్స్ ఎగవేత కేసులో నటుడు, బీజేపీ రాజ్యసభ ఎంపీ సురేష్ గోపిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు క్రైం బ్రాంచ్ పోలీసులు. తక్కువ ట్యాక్స్ వచ్చేలా కేరళలో  కాకుండా పుదుచ్చేరిలో నకిలీ డాక్యుమెంట్స్ తో రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విచారణ ఎదుర్కొటున్న సురేశ్ గోపికి ముందస్తు బెయిల్ వచ్చిన వెంటనే మంగళవారం తిరువనంతపురం కోర్టులో క్రైం బ్రాంచ్  చార్జ్ షీట్ దాఖలు చేసింది. నేరం రుజువైతే సురేష్ గోపీకి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది . రాష్ట్రంలో వెహికిల్ ట్యాక్స్ ఎగవేత కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన మొదటి కేసు ఇదేనని క్రైం బ్రాంచ్ ప్రకటించింది. పన్ను ఎగవేత కేసులు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 380 కేసులు ఉన్నాయన్నారు.

ఆడి కారు PY 01 BA 999 ను జనవరి 27, 2010 న పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించారు సురేష్ గోపి. పుదుచ్చేరిలోని యూనియన్ విభాగంలో తనకు ఇళ్లు ఉన్నట్లు తప్పుడు డాక్యుమెంట్స్ చూపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఇంకో కారు అదే అడ్రస్ తో 2016 లో రిజిస్ట్రేషన్ చేయించారు.  అయితే ఈ కేసుకు  సంబంధించి వారం రోజుల తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు పోలీసులు.